నంబర్ ప్లేట్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కోర్టుకే
ఈ రోజు వరంగల్ మైదాన్ సెంటర్లో వాహన తనిఖీలు చేపట్టిన నగర ట్రాఫిక్ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా నెంబర్ ప్లేట్ లేకుండా మరియు ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను గుర్తించడం జరిగింది.
సదరు వాహనదారులకు మోటారు వాహన చట్టం ప్రకారము జరిమానా విధించి వారితో జరిమానా కట్టించడం అయినది.
ఈ కార్యక్రమంలో 25 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. వీటితో పాటు 2 డ్రంక అండ్ డ్రైవ్ కేసులు మరియు 2 మాస్కులు లేని కేసులు కూడా నమోదు చేయడమైనది.
ఈ సందర్భంగా వరంగల్ ట్రాఫిక్ పిఎస్ ఎస్ హెచ్ ఓ నరేష్ కుమార్ మాట్లాడుతూ సిపి ఉత్తర్వుల ప్రకారం ఈ తనిఖీలు నర్వహించినట్లు తెలిపారు.
వాహనదారులందరు విధిగా తమ వాహనాల నంబర్ ప్లేట్లు నిబంధనల ప్రకారం ఉంచుకోవాలని సూచించారు.
నంబర్ ప్లేట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసు నమోదు చేయడంతో బాటు అవసరమైతే చార్జి షీటు దాఖలు చేయడానికి కూడా సంకోచించమని తెలియజేసారు.