త్వరలో అపార్టుమెంట్లు అందజేస్తాం… తోట త్రిమూర్తులు
వైఎస్సార్సీపీ లో భారీ చేరికలు…
మండపేట:- గొల్లపుంత లోని టిడ్కో అపార్టుమెంట్లు అందరికి అతి త్వరలోనే అందజేస్తామని మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
27వ వార్డు పార్దసారదినగర్ లో పట్టణ కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షులు జిన్నూరి సాయిబాబా అధ్వర్యంలో యీలి తాతాజి ప్రోత్సాహంతో పిల్లి సుబ్బారావు వేల్పుకొండ శ్రీను బృందం మొత్తం 90మంది వైఎస్సార్సీపీ లో చేరారు.
ఈ సందర్భంగా తోట మాట్లాడుతూమండపేట పట్టణంలోని గొల్లపుంత కాలనీలో అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఎన్నికల అనంతరం అందరికీ అప్పగించే బాధ్యత తనదని పేర్కొన్నారు.
ఏ సమస్య వచ్చిన తానున్నానని హామీ ఇచ్చారు. అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 56 సామాజిక వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.
గతంలో అభివృద్ధి ఫలాలు పచ్చ చొక్కా లకు, జన్మభూమి కమిటీలకి మాత్రమే దక్కేవని ఆయన విమర్శించారు.
గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తిరిగి ఎవరికి ఏ అవసరమో గుర్తించి వారికి కావలసిన రీతిలో పథకాలను వారి ఇంటి వద్దకే అందిస్తున్నామని ఆయన వివరించారు.
ఈ 27వ వార్డులో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తూ పార్టీని ఎంతగానో అభిమానిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి వార్డులోను తమకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. 30వార్డుల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తంచేశారు.
అనంతరం వైసీపీ నాయకులు జిన్నూరిసాయి బాబా ఆధ్వర్యంలో వార్డు నాయకుడు ఈలి తాతాజీ ప్రోత్సాహంతో సుమారు 90మంది వైయస్సార్ సిపి పార్టీ లోకి చేరారు.
దీనికి సహకరించిన పిల్లి సుబ్బారావు, వేల్పు కొండ శ్రీనివాస్ బృందాలను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నాయకులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాధా కృష్ణ, వార్డ్ అభ్యర్థి నీలం దుర్గ, అధికారి శ్రీను , సయ్యద్ రబ్బానీ, పిల్లి ఏడుకొండలు, మందపల్లి మహేష్, మీగడ శ్రీను, కోళ్ల శ్రీను, చల్లా ప్రసాద్, పేపకాయల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.