కరోనా పై ప్రజా చైతన్యం ఎంతైనా అవసరం
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం,రావులపాలెం మండలం,గోపాలపురం. కరోనా పై ప్రజా చైతన్యం ఎంతైనా అవసరమని, ప్రజాచైతన్యం తో కరోనాను ఎదుర్కోవచ్చునని రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మెన్ కొత్తపేట శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
ర్యాలికి చెందిన ప్రఖ్యాత మనస్తత్వవేత్త చింతా శ్యామ్ జాదుగర్ మ్యాజిక్ ఫ్యామిలీ రెండురోజుల పాటు కొత్తపేట నియోజక వర్గంలో నిర్వహించే కరోనా అవగాహన యత్రను గోపాలపురం ఆయన నివాసం వద్ద ప్రారంభించారు.
అనంతరం ఇంధ్రజాలికులు శ్యామ్, మోహిత్‌లు రావులపాలెం, కొత్త పేట మండలంలో వివిధ గ్రామాలలో పర్యటించి కోవిడ్‌పై అవగాహన కల్పిస్తూ మాస్క్‌లు దరించనివారికి కౌన్సిలింగ్ నిర్వహించి మాస్కులను అందచేసారు.
ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్‌లో త్వరితగతిన ప్రాణాలు పోవడం చూసి ఈ కార్యక్రమానికి పూనుకున్నాము అని తెలిపారు.
ఈ రోజు రావులపాలెం, కొత్త పేట మండలం లోను రేపు ఆత్రేయపురం, ఆలమూరు మండలంలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాము గారు, శ్యామ్, మోహిత్‌లు పాల్గొన్నారు.