ఏవోబీలో ముగ్గురు కీలక మావోయిస్టులు లొంగుబాట
ఆంద్రా-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ లో కీలకంగా వ్యవహిరిస్తున్న ముగ్గురు కీలకమైన మావోయిస్టులు బుధవారం ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి ముందు లొంగిపోయారు.
ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ మిలటరీ ప్లాటూన్ ఏరియా కమిటీ సబ్యులు మయినూ అలియాస్ సంబూ, రమా అప్కాతో బాటుగా ఏవోబీ ఎస్జడ్సీలోని గుమ్మ ఏరియా కమిటీ సబ్యుడు రఘు ఖరాలు లొంగిపోయిన వారిలో ఉన్నారు.
మయినూ, రమా అప్కా లు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజ్పూర్ జిల్లాకు చెందిన వారు కాగా, వీరు 2009 నుంచి నిషేదిత మావోయిస్టు పార్టీలో ఉండగా, వీరి మీద చెరొకొక నాలుగు లక్షల రూపాయలు రివార్డు ఉంది.
మల్కన్‌గిరి జిల్లా బెజ్జింగి గ్రామం. నకు చెందిన రఘు ఖరా గత మూడు సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. ఇతనిపై రూ.లక్ష రివార్డు ఉంది.
ఇటీవల కటాఫ్ ఏరియాలో పోలీసులు ఏర్పాటు చేసిన అవుట్ పోస్టులు వల్ల ఈ ప్రాంతంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరుగుతుండటంతో ప్రజలు శాంతి వైపు మొగ్గు చూపుతున్నారని, దీనికి తోడు పెద్ద నాయకులు వేధింపులు ఎక్కువయ్యావని దీంతో లొంగుబాటుకు నిర్ణయించుకున్నామని లొంగిపోయిన మావోయిస్టులు విలేకర్లు సమావేశంలో పేర్కొన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులము పూర్తిస్థాయిలో ఆదుకుంటామని జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు.