వైఎస్సార్సీపీ కి పట్టం కట్టండి…
వార్డుల్లో తోట ప్రభంజనం…
మండపేట:- ప్రజామద్దతుతో మండపేట పురపాలక సంఘం ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తధ్యమని మండపేట వైఎస్సార్సీపీ ఇంచార్జ్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
మండపేట సంఘంకాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తోటకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
భరోసాగా ఉంటామని పేద బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు పట్టంకట్టలని కోరారు.
మండపేట సంఘం కాలనీలో వైసీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. జన ప్రభంజనం తోటకు అండగా నిలిచారు.
ఆ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి మారిశెట్టి సత్యనారాయణ గెలుపు కోరుతూ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
జై తోట జై జై తోట నినాదాలతో కాలనీ మారుమ్రోగిపోయింది. అడుగడుగునా ప్రజలు తోటకు బ్రహ్మరథం పట్టారు.
30వ వార్డు అభ్యర్థి మారిశెట్టి సత్యనారాయణ ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని తోట విజ్ఞప్తి చేసారు.
ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం 80 శాతం ప్రజలకు ఏదొక రూపంలో సంక్షేమ ఫలాలు అందాయన్నారు. మరో 20 శాతం ప్రజలకు సైతం త్వరలో లబ్ది చేకూరుతుందన్నారు.
అగ్రవర్ణ పేదలను సైతం ఆదుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ముఖ్యంగా ప్రజల కోసం పని చేసే వైఎస్సార్సీపీ నాయకులు కావాలో ఎన్నికలప్పుడు ఓట్లు కొని అప్రజాస్వామికంగా పాలించే టీడీపీ నాయకులు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. టీడీపీ డబ్బు రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలకాలని కోరారు.
ప్రజల కోసం పని చేసే వారిని అందలమెక్కించాలని కోరారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలన్నీ గుమ్మం వద్దకే వచ్చి చేరుతున్నాయన్నారు.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఓట్లు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, వైఎస్సార్సీపీ నేతలు సత్తి రాంబాబు, ఉండ్రాజపు అర్జున్ , విరమల్లు శ్రీనివాస్, ఆ వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.