మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్..
హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేడు ఆయన ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు.
స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు, ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని కేటీఆర్ వెల్లడించారు.
స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ ప్రోటోకాల్ పాటించి టెస్టు చేయించుకుని జాగ్రత్తగా ఉండండి అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.