20 లక్షల విలువ చేసే మోటార్ సైకిళ్ళను చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగలు పట్టివేత
స్థానిక విజయవాడ సిటీలో గత కొంత కాలంగా పలు మోటార్ వాహనములు దొంగతనం జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వెస్ట్ జోన్ ఏ సి పి వి హనుమంత రావు ఆధ్వర్యంలో ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఐదు ఆరు గురు సభ్యులతో వింగ్ ఏర్పాటయింది వీరంతా చోరీ జరిగిన ప్రాంతాల్లో మాటు వేసి రాత్రనకా పగలనకా నిఘా పెట్టి ఆ దొంగలలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్దనుండి 31 మోటార్ సైకిల్ లు ఒక మోటార్ గూడ్స్ పార్సిల్ వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు వీరు పాత నేరస్తుల అని గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారిని వారి వృత్తిని వదలక మళ్లీ దొంగతనాలు చెయ్యటం ప్రారంభించారని పోలీసులు తెలియజేశారు.
వీరు ఏలూరు 4 పెనమలూరు 6 ఉయ్యూరు 1 కృష్ణాజిల్లా వీరవల్లిలో బంటుమిల్లిలో 1 వన్ టౌన్ లో 7 టూ టౌన్ లో ఒకటి పడమట 6 గుంటూరు అర్బన్ 1 అరండల్ పేట1 మంగళగిరి 1 తెలంగాణ హైదరాబాదులో కూడా మొత్తం కలిపి 32 నేరాలు చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు.
ఈ చోరీ చేసిన నిందితుడు పాతూరి సాయి శేఖర్ కాగా, ఈ వాహనాలును కె రవితేజ నాయక్ ద్వారా అమ్మటం చేసేవారిని పోలీసులు తెలియజేశారు.
ఈ దొంగలను పట్టుకోవడంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు వన్ టౌన్ క్రైమ్ ఎస్ఐ ఎం శ్రీనివాసరావు, జి శంకర్రావు, యు లోకేష్, నాగబాబు, ఐ వెంకటరమణ తదితర సిబ్బంది పనితనం చూపించారని పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు ఐపీఎస్ వీరందరినీ అభినందించారు.