శ్రీకాకుళం : కరోనా రెందో దశ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రాగోలు జెమ్స్‌లో ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి వీలుగా ప్రత్యేకంగా బెడ్లు కేటాయించారు.
ఈ మేరకు కలెక్టర్ జె.నివాస్ శనివారం ఉత్తర్వులను జిల్లా పౌర సంభందాల అధికారికి పంపించారు.
కోవిడ్ సోకిన జర్నలిస్టులు ముందుగా డిపిఆర్ఒను సంప్రదించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇప్పటికే జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు కోవిడ్ బారిన పడి మృతి చెందగా… పలువురు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
