ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకుని జాతర ఏర్పాట్లను సమీక్షించారు.
ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారికి RDO సాయిరాం, ఆలయ ఈవో సార శ్రీనివాస్ మరియు సిబ్బంది పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో శ్రమించి జాతర ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతో, మంత్రి వర్యులు హరీష్ రావు గారి సహకారంతో ఏడు పాయలను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు జగన్, మండల నాయకులు బాపా రావు, బాలా గౌడ్, కిష్టాగౌడ్, గౌస్, కుబేరుడు, సర్పంచులు వెంకట్ రెడ్డి, సంజీవ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనాధ్ రావు, ఉత్సవ కమిటీ సభ్యులు, ఉపసర్పంచ్ అజయ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Post Author
AndhraJunction
Related

సిఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు విజయం సాధించిన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల తో కలిసి సీఎం కేసిఆర్ గారిని ప్రగతి భవన్ లో ఆదివారం కలిసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు, పల్లా…

టి అర్ ఎస్ అభివృద్ధి కావాలా విపక్షాల అబద్ధాలు కావాలా
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కావాలా… విపక్షాలు చెబుతున్న అబద్ధాల మాటలు కావాలా… అనేది పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలి….. ఎమ్మెల్యే అరూరి…. ఐనవోలు మండలం పున్నెల్ గ్రామంలో నిర్వహించిన పున్నెల్, పెరుమాండ్లగూడెం గ్రామాల పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టభద్రులు తెరాస పార్టీ వెంటే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్…

గ్రేటర్ వరంగల్ పుర పోరులో నల్ల స్వరూపరాణి ప్రచారం
గ్రేటర్ వరంగల్ పుర పోరులో నల్ల స్వరూపరాణి ప్రచారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 57వ డివిజన్ పరిధిలోని అశోక కాలనిలో టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నల్ల స్వరూపరాణి-సుధాకర్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి స్వరూపరాణి మాట్లాడుతూ "సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం…