శ్రీకాకుళం జిల్లాలో ఆటో బోల్తా ఒకరి మృతి
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఆకులతంపర వద్ద యల్. యన్.పేట మండలం కోవిలం అల్లాడ గ్రామాలకి చెందిన ఏడుగురితో ప్రయాణిస్తున్న నాయీబ్రాహ్మణ ల ఆటో బోల్తా పడింది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కొత్తూరు మండలం బమ్మిడిలో పెళ్లి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఘటన సంభవించింది.
బాధితులను కొత్తూరు ఆసుపత్రికి తరలించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.