విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖపట్నం జిల్లా జుత్తాడ గ్రామంలో జరిగిన ఆరుగురి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు.
నిందితుడు అప్పలరాజు కూతురితో ఆ కుటుంబానికి చెందిన విజయ్ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు.
ఆ కారణంగానే అప్పలరాజు విజయ్ కుటుంబాన్ని మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.
ఆయితే అప్పలరాజు దాడి నుంచి రామారావు కుమారుడు విజయ్ తప్పించుకున్నాడు. దాడి జరిగిన సమయంలో అతను ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో మిగిలాడు.
అప్పలరాజు దాడిలో రామారావు సహా ఆరుగురు కుటుంబ సభ్యులు మరణించారు.
అప్పలరాజు, రామారావు కుటుంబాలు ఇరుగుపొరుగున ఉండేవని, ఈ ఇరు కుటుంబాల మధ్య గొడవలు సాగుతూ వచ్చాయని తెలుస్తున్నది.