కాజీపేట: తెలంగాణ రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదన్న కేంద్ర హోంశాఖ ప్రకటనను వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాజీపేట రైల్వే స్టేషన్ ఎదురుగా కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కని,
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కని అన్నారు.
రైల్వే డివిజన్ మరియు కోచ్ ఫ్యాక్టరీ సాధనకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ పార్టీలు కలసి రావాలని పిలుపునిచ్చారు
ఉత్తర తెలంగాణలో అభివృద్ధికి మూలకేంద్రం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు.
రైల్వే డివిజన్ మరియు కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షగా అభివర్ణించారు.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు.
ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాట్లే ఐక్య పోరాటాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా సాధించుకుందామని పిలుపునిచ్చారు.
విభజన చట్టంలో ప్రకటించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పై ప్రతి ఒక్క తెలంగాణ వాది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ సాధన కొరకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు తెలంగాణ సమాజం మొత్తం కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని కొరారు.
కోచ్ ఫ్యాక్టరీ సాధించేంతవరకు కేంద్ర ప్రభుత్వం పై మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.