పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం..
పెద్ద మొత్తంలో గంజాయిని నగరంలోకి చేరకుండా అదుపు చేయడంలో సఫలమైన నగర పోలీసులు.
స్థానిక మూడో పట్టణ పోలీసులు స్వాధీనం ..
ప్రస్తుతం మూడో పట్టణ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ ఆది ప్రసాద్ మరియు పట్టణ ఎస్సై వెంకటరమణలు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అటుగా వస్తున్న ఒక ఆటోను ఆపి తనిఖీలు నిర్వహించగా ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.
మొత్తం 109 కేజీల గంజాయిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆ గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వీరిని పోలీసు స్టేషనుకు తరలించి విచారించగా మరో ఇద్దరు మహిళలు కూడా ఈ కేసులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని కూడా అరెస్టు చేశారు.
గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ కేసులో ప్రధమ ముద్దాయిగా ఉన్న తాడి లక్ష్మి, గాన మందపల్లి త్రిమూర్తులు, సరుకు రవాణా చేసే పాంగి మత్య రాజులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ప్రసాద్ ఎస్ఐ వెంకటరమణలను డిఎస్పీ దిలీప్ కిరణ్ అభినందించారు.