బ్రేకింగ్ ……ఠాగూర్ సినిమాను తలపిస్తున్న దాచేపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
గుంటూరు జిల్లా: జిల్లాలోని దాచేపల్లి మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన తేలుకుట్ల మల్లయ్య యాదవ్ గత నెల 18 వ తారీకున ఫ్యాక్టరీల దుమ్ము, దూళికి పంట నష్టపోయాడు.
దీనితో కలత చెందిన మల్లయ్య పురుగులమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న బంధువలు మల్లయ్యను హుటాహుటిన స్థానికంగా గల ఒక ప్రైవేటు నర్సింగ్ హొంలో చేర్పించారు.
కొంతసేపు మల్లయ్యకు చికిత్స చేసిన హాస్పటల్ యాజమాన్యం కొద్ది గంటల గడిచిన తరువాత మల్లయ్య చికిత్స పొందుతూ మరణించినట్లు, చికిత్సకు అయిన మొత్తాన్ని చెల్లించి మల్లయ్య పార్ధివ దేహాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా బంధువులకు తెలియజేశారు.
అయితే మల్లయ్య మరణ వార్తను జీర్ణించుకోలేని బంధువులకు సదరు హాస్పిటల్ యాజమాన్యంపై పట్టరాని కోపం వచ్చింది.
అప్పటికే మరణించిన తమ బంధువు మల్లయ్యను కేవలం డబ్బు కోసమే అన్ని గంటలపాటు ట్రీట్మెంటు పేరుతో ఉంచుకున్నారని, ఎటువంటి ట్రీట్మెంటు చేయకుండానే డబ్బు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
అక్కడితో ఆగని బంధువులు, డాక్టర్ ఉన్న గది తలపులు బద్దలు కొట్టి అక్కడ ఉన్న డాక్టరుకు దేహశుద్ధి చేశారు.
ఈ సందర్భంగా హాస్పిటళ్ళలో జరుగుతున్న దోపిడీలకు సాధారణ జనం బెంబేలెత్తుతున్నారని పురుటినొప్పులతో హాస్పిటళ్ళకు వేళ్తే బిడ్డ అడ్డం తిరిగిందంటూ ఆపరేషన్లు తప్పనిసరి చేస్తున్నారని అక్కడ ఉన్న స్థానికులు వాపోతున్నారు.
అంతేకాక ప్రత్యేక ప్యాకేజీల పేరుతో కడుపులో ఉన్నది మగబిడ్డా , ఆడబిడ్డా అనేది కూడా స్కానింగ్ తీసి చెప్పడమే కాక, అడిగిన వారికి అబార్షన్లు సైతం చేస్తున్నట్లు స్థానికులు కొన్ని హాస్పటళ్ళను ఉద్దేశించి ఆరోపించారు.