కోవాక్సిన్ రెండవ డోసు కోసం ప్రజలు ఎదురు చూపు..
సామాజిక దూరం మరచిన ప్రజలు..
మాండవ్యపురం (మండపేట): కోవాక్సిన్ మొదటి డోసు తీసుకుని రెండవ డోసు కోసం ఎదురుచూస్తున్న వారికి మండపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సిన్ వేస్తున్నారని తెలియడంతో రెండవ డోస్ వేయించుకునేందుకు ఒక్కసారిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు జనం తరలివెళ్లారు.
అయితే వచ్చిన జనానికి సరిపడా వ్యాక్సిన్లు లేకపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కాస్త అలజడి నెలకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగప్రవేశం చేయవలసి వచ్చింది.
అయితే అక్కడి ప్రజలు మండుటెండలో ఉదయం నుంచి వ్యాక్సిన్ కోసం పడిగాపులు కాస్తున్న వారిని పక్కన పెట్టి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సిఫార్సులతో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.
వీటిపై పట్టణ ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ ప్రభువును వివరణ కోరగా వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి సిఫార్సులకు లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఈరోజు కోవాక్సిన్ 50 మందికి సరిపడా వచ్చిందని 60 సంవత్సరములు దాటిన 50 మందికి ఈ వ్యాక్సిన్ వేశామని, మిగిలిన అందరికీ రెండో డోసు రెండు మూడు రోజుల్లో వేస్తామని భరోసా ఇచ్చారు.
ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ వచ్చిన వెంటనే అందరికీ సమాచారం అందిస్తామని ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు.