హిందూ రుద్రభూమిలో అన్యమతస్తులకు అవకాశం లేదు..
హిందూ ధర్మ పరిరక్షణ సమితి..
మండపేట: హిందూ రుద్రభూమిలో అన్యమతస్తులకు అవకాశం కల్పించడం సరైన విధానం కాదని హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు పేర్కొన్నారు.
హిందూ స్మశాన వాటికలో ఇతర మతాలకు అవకాశం కల్పించకూడదని శనివారం కమిషనర్ రామ్ కుమార్ కు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు వినతి పత్రం అందజేశారు.
హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మండపేట పట్టణంలో ఉన్న హిందూ రుద్రభూమికి
సుమారు 150 సంవత్సరాల క్రితం ఆనాటి స్ధలదాత దాసిరెడ్డి పెదబాపయ్య మొదటిగా గాంధీనగరంలో స్థలం ఇచ్చారని, కాలక్రమేణా ఊరు దగ్గరకావడంతో విజయమహాల్ పక్కన 151/1 సర్వే నెంబరు గల 4 ఎకరాల 58 సెంట్ల స్దలం స్మశానానికి మంచి ఆశయంతో స్థలం ఇచ్చారని తెలిపారు.
అయితే గత నెల 29 వ తారీఖున జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో క్రిస్టియన్లకు కూడా హిందూ స్మశాన వాటికలో కొంత స్థలం కేటాయించాలని 29 వార్డు కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్ లేవనెత్తడం సరికాదని అన్నారు.
జనం పెరిగారనే నెపంతో క్రిస్టియన్లకు హిందూ స్మశాన వాటికలో కొంత స్థలం అడగడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు.
ప్రస్తుతం ఉన్న ఈ రుద్రభూమికి వేరే మతాల వారికి ప్రవేశం లేదని, గజం స్థలం వృధా అయినా ఊరుకోబోమని స్థలదాత ఆశయం మేరకు ఉండాలని, అక్కడ ఆయన విగ్రహంతో పాటు ఆయన పేరును కూడా రుద్రభూమికి పెట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ యినపకోళ్ల సత్యనారాయణ, ప్రముఖ అడ్వకేట్ కోటిపల్లి సాయిరాం, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు నాళం ఫణి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.