గిఫ్టుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ళ ముఠా అరెస్టు
గిఫ్ట్ వచ్చిందని అన్లైన్ వినియోగదారులను నమ్మంచి డబ్బులను దోచుకుంటూ మోసాలకు పాల్పడుతున్న 13మంది సభ్యులు గల ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసుల సంయుక్తంగా శుక్రవారం అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుండి 14లక్షల 36వేల రూపాల నగదుతో పాటు 15 సెల్ ఫోన్లు, స్క్రాచ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఇప్పరాజ్ కుమార్(ప్రధాన నిందితుడు), తాళ్లపల్లి దామోదర్ గౌడ్ అలియాస్ దాము బాయ్, దాసరి హరీష్ గౌడ్, మేకల అదిత్య, 5. ఆకునూరి శ్రవణ్ కుమార్, పోరండ్ల విజయ్, ఈద రవికుమార్, దార్శ గణేష్, సిరికొండ వినోద కుమార్, వోల్లల ప్రవీణ్, గంగాధరి రాంచందర్, ఆడేపు సిద్ధార్డ్ వున్నారు.
వీరికి సహకరించిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పరారీ వున్న నిందితులను కలకత్తాకు చెందిన ప్రజీత్, సంజీవ్, ప్రకాశ్ లుగా గుర్తించారు.
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఇప్పరాజ్ కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు.
ఇదే ఆలోచనతో అన్లైన్ ద్వారా గిఫ్టు వచ్చిందని అమాయక ప్రజలను నమ్మించి డబ్బు దోచుకోవాలని మరో ప్రధాన నిందితుడైన తాళ్లపల్లి దామోదర్ గౌడుతో కలిసి ప్రణాళికను రూపొందించుకున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే పోలీసులకు చిక్కతామని, నిందితులు ఈ ఆన్లైన్ మోసాలకు కోల్కత్తా నగరాన్ని తమ స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు.
కోల్‌కత్తాలో స్థానికంగా వున్న ప్రజీత్, సంజీవ్, ప్రకాశ్. (ప్రస్తుతం వీరు ముగ్గురు పరారీలో వున్నారు) లను తమ అనుచరులగా నియమించుకోని కలకత్తాలోని ఓ అపార్ట్మెంట్లోని గదినుండి వీరి కార్యకలాపాలను 2014 ప్రారంభించారు.
ఇందుకోసం నిందితులు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ షాపింగ్ చేసిన వారి సెల్ ఫోన్ నంబర్లను సేకరించి సదరు ఆన్లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసిన వ్యక్తుల సెల్ ఫోన్లకు ఫోన్ చేసేవారు.
వారితో మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినందుకుగాను నిర్వహించిన డ్రాలో కారుని బహుమతిగా గెలుచుకున్నారని, మీరు గెలుచుకున్న కారును దక్కించుకోవాలంటే రొడ్డు టాక్స్ నిమిత్తం కొద్ది మొత్తంలో డబ్బును బ్యాంకులో జమచేయాలని తెలిపేవారు.
అదే విధంగా నిందితులు సదరు ఆన్లైన్ షాపింగ్ చేసిన వ్యక్తి ఇంటి చిరునామాకు డబ్బులు లేదా కారును గిఫ్ట్ గా గెలుచుకున్నారనే విధంగా స్క్రాచ్ కార్డులను రూపొందించిన వాటిని పోస్ట్ చేసేవారు.
గిఫ్ట్ వివరాలను తెలుసుకోనేందుకు గిఫ్ట్ కార్డులోని ఫోన్ నంబర్లకు సంప్రదిస్తే నిజంగానే డబ్బు లేదా కారును బహుమతిని గెలుచుకున్నట్లుగా నిందితులు సమాధానం ఇవ్వడంతో పాటు వీటి పొందేందుకుగాను అవసరమయిన పన్నులు చెల్లించాలని చెప్పేవారు.
ఇందుకోసం నిందితులు ఒక నకీలీ బ్యాంక్ ఖాతాను కుడా తెరిచేవారు. ఈ విధంగా ఈ ముఠా సభ్యులు రోజుకి 30 నుండి 40 వరకు మంది ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసేవారు.
ఇందుకోసం ఈ ముఠా సభ్యులు నకీలీ సెల్ ఫోన్ నంబర్లతో పాటు వినియోగదారులతో మాట్లాడేందుకుగాను పోలీసులు అరెస్టు చేసిన నిందితులను ఈ కాల్ సెంటర్ లో నియమించి ఈ ముఠా ఈ మోసాలకు పాల్పడుతుండేవారు.
ఈ విధంగా మోసపోయిన ఆన్లైన్ వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంతేజార్ గంజ్, స్టేషన్ ఘన్పూర్, జఫర్ గడ్, గీసుగొండ, ఖానాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులను నమోదు చేసుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అదేశాల మేరకు సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా అధ్వర్యంలో టాస్క్ఫ ర్స్ పోలీసులు ప్రస్తుతం వున్న అధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోని నిందితుల కదలికలను గుర్తించారు.
ఈరోజు ఉదయం నిందితులు కొలకత్తకు తిరిగి వెళ్ళే క్రమంలో వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో వున్నట్లుగా సమచారం అందడంతో స్థానిక టాస్క్ఫర్స్ పోలీసులు, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించగా వారు పాల్పడిన నేరాలను అంగీకరించారు.
నేరాలను గుర్తించడంతో పాటు పెద్దమొత్తం డబ్బును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, టాస్క్ఫ ర్స్ ఇంచార్జ్ ఎ.సి.పి ప్రతాప్ కుమార్, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, మధు,ఇంతేజార్ గంజ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ ఆనాటికల్ అఫీసర్ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాం సుందర్, సోమయ్య,కానిస్టేబుళ్ళు అలీ, చిరంజీవి, శ్రీకాంత్, సృజన్, శ్రీనివాస్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.