మే 8 వరకు తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు!
తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ మరికొన్ని రోజులు కొనసాగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వం గతనెల 20 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది, అది నేటితో ముగియనుంది.
ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బుధవారం హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకున్నారు.
వీటిన్నంటినీ పరిశీలించిన సీఎం కేసీఆర్ కర్ఫ్యూ పొడిగింపునకే మొగ్గు చూపారు. ఈ అంశమై ఈ రోజు నిర్ణయం ప్రకటించారు.
తాజా నిర్ణయంతో మే 8వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఈ రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
తెలంగాణలో లాక్డౌన్ వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతుండగా అందులో ఎటువంటి వాస్తవం లేదని హోంమంత్రి మహమూద్ అలీ తెలపగా, ఇప్పటికైతే లాక్డౌన్ విధించే ఆలోచన లేదని వైద్యమంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.