ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
అమరావతి: ఏపీ సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లాకు చెందిన అరిగెల నాగార్జునకు ప్రభుత్వ భూమూలకు పట్టాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు అప్పుడు చిట్టమూరు ఎమ్మార్వో కార్యాలయంలో తహసిర్దారుగా పని చెసిన చంద్రశేఖర్.
ఈ క్రమంలోనే చంద్రశేఖర్ అరిగెల నాగార్జున వద్ద నుండి దాదాపు కోటిన్నర రపాయల వరకు లంచం తీసుకున్నట్ల సదరు దంపతులు అరోపిస్తున్నారు.
డబ్బు తీసుకుని కూడా తమకు ఇస్తానన్న భూముల పట్టాలు తమకు ఇవ్వకపోడవంతో తాము మోసపోయామని, తమకు ఇంక మరణమే శరణం అని భావించిన అరిగెల నాగార్జున దంపతులు తమ ఇద్దరు పిల్లల్ను కలుపుకుని పెట్రోల్ డబ్బాతో వచ్చి తమకు న్యాయం జరగాలంటూ అమరావతి సచివాలయం ఎదురుగా ఆత్మహత్యా యత్నం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సదరు దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ దంపతులు ఇదే సమస్యతో గతంలో నెల్లూరు జిల్లా కలక్టరేట్ వద్ద కూడా ఆత్మహత్యా యత్నం చేయగా జిల్లా కలెక్టర్ స్పందించిన కలెక్టరేట్ సిబ్బంది తమకు న్యాయం జరిగేలా చూస్తామని హామి ఉవ్వగా.
సదరు చంద్రశేఖర్ మరియు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఇద్దర్ని సైతం ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది.