శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ తెలిపారు.
ఈ రోజు ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి మాట్లాడుతూ, నెల్లూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైందని అన్నారు.
నగరంలో ప్రవహిస్తున్న సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులను ఏప్రిల్ 15 నుండి మొదలు పెడతామని పేర్కొన్నారు.
కరోనాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని మంత్రి అనిల్ ప్రజలను కోరారు.