వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు విజయం సాధించిన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల తో కలిసి సీఎం కేసిఆర్ గారిని ప్రగతి భవన్ లో ఆదివారం కలిసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించుకుని వచ్చినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అభినందించారు.
ఇందుకు మంత్రి తో పాటు, మిగతా నేతలు సీఎం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
సీఎం గారిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్లు లు సుధీర్ కుమార్, పాగాల సంపత్ రెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, లింగాల ఘనపూర్ జెడ్పీటీసీ వంశీ ధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.