గొల్లపుంత అభివృద్దికి కృషిచేసింది తామే…
మౌళిక సదుపాయాల కల్పన గృహ నిర్మాణం చేసింది మేమే…
ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రచారానికి విశేషస్పందన…
మండపేట:- మండపేటలోని 20వ వార్డు పరిధి గొల్లపుంత కాలని అభివృద్దికి కృషిచేసింది తామేనని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు.
ఆ వార్డులో గృహనిర్మాణాలు పూర్తిచేసి రోడ్లు, డ్రైన్లు, మంచినీటి వసతి, పార్కు, పాఠశాల, వాటర్ ట్యాంక్ లు ఇలా కోట్లాదిరూపాయలు నిధులు వెచ్చించిన విషయాన్ని ఆయన వివరించారు.
ఆ వార్డులో టిడిపి చైర్మన్ అభ్యర్ధి గడి సత్యవతి, కౌన్సిలర్ అభ్యర్ధి మేడింటి కమలకుమారిలతో కలసి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళకు అడుగడుగునా స్వాగతం లబ్ధించింది. ప్రజలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వెంట నడిచారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది చేస్తామని చెబుతున్న వలస నేతలు ఈ రెండేళ్ళలో మండపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది చేశారో వివరించాలని సవాల్ విసిరారు.
అమలుకాని హామీలను గుప్పిస్తూ పబ్బం గడుపుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండే మండపేట ప్రజలలో కులాల చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఈనెల 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులలోను టిడిపి అభ్యర్ధులకు ఓట్లు వేసి ఘనవిజయాన్ని చేకూర్చాలని తద్వారా వలస నాయకులకు బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మేడింటి సూర్యప్రకాశరావు, టేకి వెంకటరమణ, పాలింగి కమల, గోకాడ నాగకుమారి, చింతాకుల శ్రీను, పందిరి రాంబాబు, మార్గాని భవాణి, బుంగా సంజయ్, కందుల శ్రీను, కోరా గోవిందు, పెనుబోతుల సత్తిబాబు, నామాల సకుంతల, కామాడి అమూల్య, దొంతంశెట్టి సూర్యప్రకాష్, బాసిన బాబి, కంటిపూడి శ్రీనివాసరావు, కర్రి తాతారావు, పెదపాటి సత్యనారాయణ మూర్తి, దొంతంశెట్టి మల్లేశ్వరరావు, బాసిన సుభ్రహ్మణ్యం, శీల ఏసుదాసు, గ్రంధి రామకృష్ణ, చింతా వెంకన్న, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.