కడప జిల్లా… దిశ పోలీస్ స్టేషన్ ఆవరణంలో 50 దిశ ప్రత్యేక ద్విచక్ర వాహనాలు, ఒక మినీ వ్యాన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్….

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మహిళల భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగింది….
ఆపదలో ఉన్న మహిళలకు భద్రత, రక్షణ కల్పించడం కోసం దిశ యాప్ను ఏర్పాటు చేయడం జరిగింది….
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగింది…
దిశ వాహనాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి…
ఘటన స్థలానికి కానిస్టేబుల్ స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది….
అందరూ ఒక బృందంగా మినీ వ్యాన్ లో వెళ్లి దర్యాప్తు చేపడుతారు….
దిశ పెట్రోలింగ్ వాహనాల వల్ల మహిళల భద్రతకు భరోసా కల్పించనున్నాం…
ఈవ్ టీజింగ్, వేధింపులు నియంత్రించేందుకు దిశ సిబ్బందికి ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు…
విద్య సంస్థలు, దేవాలయాలు, శివారు ప్రాంతల్లో దిశ వాహనాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు వినియోగించనున్నామన్నారు…
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఖాసీం సాహెబ్, దేవా ప్రసాద్, ఏ. ఆర్ అదనపు ఎస్పీ రిషికేషవ రెడ్డి, దిశ డీఎస్పీ షౌకత్ అలీ, కడప డీఎస్పీ సునీల్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బివి శివారెడ్డి, ఏఆర్ డీఎస్పీ రమణయ్య ఆర్.ఐ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు….