సాగర తీర ప్రాంతాల్లో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
తుఫాను హెచ్చరికల దృష్ట్యా వజ్రపుకొత్తూరు మండలం సాగర తీర ప్రాంతాల్లో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
యాస్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో ఈ రోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు, గునుపల్లి తీరప్రాంతాల్లో పర్యటించారు,
అక్కడి పరిస్థితులపై స్థానికులతో సమీక్షించారు, ప్రస్తుతానికి తుఫాన్ పరిస్థితి అదుపులోనే ఉందని, మన ప్రాంతానికి తీవ్రత ఉండకపోవచ్చని అయినా సరే అధికారులు అన్ని సహయక చర్యలు చేప్పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు,
ఆయనతో పాటు వజ్రపుకొత్తూరు మండల ఎంపీడీఓ, ఎమ్మార్వో, అధికారులతో పాటు వైసీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.