సేవా గుణం చాటుకున్న చిరంజీవి, అలీ
హైదరాబాద్: కొవిడ్ సెకండ్ వేవ్‌లో చాలామంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాంటి వారిని చూసి చలించిన ప్రముఖ నటుడు చిరంజీవి తనవంతు సాయం చేసి ఆదుకుంటున్నారు.
ఇప్పటికే పలువురు నటులు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి సేవలు అందించిన కుటుంబాలకు చేయూతనిచ్చారు. అనారోగ్యంతో బాధపడుతోన్న భరత్ భూషణ్ అనే ఫొటో జర్నలిస్టుకి ఆదివారం రూ. 50వేలు సాయం అందించి తన సేవాగుణం చాటుకున్నారు.
కుటుంబ సమేతంగా అలీ
ప్రముఖ హాస్య నటుడు అలీ సైతం సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తన సతీమణి జుబేదాతో కలిసి తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కి చెందిన 130 మందికి నిత్యావసరాలు అందించారు.
