టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని కలిసిన వైకాపా నాయకులు…
మండపేట మునిసిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడంతో వైకాపా నాయకులు తోట త్రిమూర్తులు, వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, పతివాడ నూక దుర్గా రాణీ, మంగళవారం విజయవాడలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
వైఎస్సార్సీపీ గెలుపును సాధ్యం చేసిన వైకాపా ఇంచార్జ్ తోట త్రిమూర్తులను అభినందించారు.
మండపేట మున్సిపాలిటీ విజయం సాధిచడం పట్ల సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ గా గెలుపొందిన పతివాడ నూక దుర్గా రాణి కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పధకాలే ఈ ఫలితాలకు నిదర్శనమైతే మండపేటలో జగన్కు తోడు తోట హవా జత కలిసి ఇంతటి విజయానికి కారణం అయిందని మండపేట మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా సాగిపోవాలని పేర్కొన్నారు.