ప్రజల ఆకాంక్షల మేరకు పురపాలన– మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు
ప్రజా ఆకాంక్షలు నెరవేరుస్తాం…
సర్వతో ముఖాభివృద్దికి కృషి…
టిడిపి చైర్మన్ అభ్యర్ధి గడి సత్యవతికి మద్దత్తుగా ఎమ్మెల్యే ప్రచారం…
మెజారిటి వార్డులలో గెలుపు సైకిల్ దే…
మండపేట:- మండపేట పట్టణ ప్రజల ఆకాంక్షల మేరకు పురపాలన అందిస్తామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మండపేట టిడిపి చైర్మన్ అభ్యర్ధి, 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ధి గడి సత్యవతి, 6వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్ధి కాసిన కాశీ విశ్వనాధంల గెలుపు కోరుతూ శుక్రవారం 6వ వార్డులలో ప్రచారం నిర్వహించారు.
ఈ సంధర్బంగా ప్రజల నుండి విశేష స్పందన లభించిందని వారు పేర్కొన్నారు. ప్రతీ వీధిలోను మహిళలు పెద్ద ఎత్తున వీరి ప్రచారంలో పాల్గొని తెలుగుదేశంపార్టీని గెలిపిస్తామని నినాదాలు చేశారు.
ప్రజలు చెప్పిన సమస్యలు అన్నింటిని విని వాటి పరిష్కారానికి కృషిచేస్తానని హామి ఇచ్చారు. పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, పాలచర్ల కృష్ణ బ్రహ్మజి, వేగుళ్ళ సతీష్, వల్లూరి నారాయణమూర్తి, పాలచర్ల శిరీష్, గుడిమెట్ల నాగబసవలింగం, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.