నాడు సమస్య నేడు పరిష్కారం..
తక్షణమే స్పందించిన మున్సిపల్ యంత్రాంగం..
మండపేట: మండపేట పురపాలక సంఘం ఎదురుగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మెట్ల మార్గం పక్కన సన్ షేడ్ వాల్ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న విషయం బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ ల దృష్టికి వెళ్ళింది.
వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ లు సమస్యను గుర్తించి త్వరితగతిన మరమ్మతులు చేపట్టారు.
ప్రతిరోజు వందలాది మంది తిరిగే ప్రాంతం కనుక ప్రజలు ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నందుకు ప్రజలు, వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read: కూలిందో అంతే సంగతులు గతంలో ఇద్దరు మరి ఇప్పుడో?
