విధివ్రాతను ఎవరూ మార్చలేరు..
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం:
రోజంతా భానుడి భగభగలతో మండిపోయిన వాతావరణం వర్షపు ఛాయలతో అమాంతం చల్లబడింది.
కారు మేఘాలు మృత్యుపాశాలై ఆకాశాన్ని కమ్మేశాయి. ఈదురు గాలులతో వచ్చిన వర్షపు ఛాయలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
సమయం మించిపోక ముందే త్వరగా ఇంటికి చేరాలి అనుకున్నాడు అతడు, అనుకున్నదే తడవుగా బండి వేగం పెంచాడు.
చినుకు రాలింది మేని తడిచింది, అయితేనేం తొందరగా ఇల్లు చేరుదాం అనుకున్నారు ఆ జంట.
అయితే దైవం వారి నుదిటివ్రాత మరోలా వ్రాసినట్లు అప్పుడు వారికి తెలియలేదు, తెలిసే సమయానికి ఏమీ మిగలలేదు.
విధివ్రాతను తప్పించుట ఎవరి తరం?
ఇంటికి వెళ్ళే తొందరలో ఉన్న వారి మృత్యువు పిడుగు రూపంలో తమ పక్కకు చేరింది, పక్కనే ఉన్న సెల్ టవర్ పై పడింది, అంతే అమాంతం ఆ టవర్ నేలకొరిగింది.
పిడుగు పాటుతో కూలిన టవర్ ఆ జంటపై పడింది. బైక్ నడుపుతున్న బాదంపూడి గ్రామానికి చెందిన బొట్టు రాజేష్(4) అక్కడికక్కడే మృతి చెందాడు.
అతనితోపాటు బైక్ మీద ఉన్న మహిళకు తీవ్ర గాయాలపాలయింది.
వెంటనే మహిళను ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
విపరీతమైన గాలిదుమ్ముతో, ఉరుములు మెరుపులు రావడంతో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎవరేమి చెప్పినా, ఎవరు ఏమి చేశినా, విధి వ్రాతను మార్చడం మన తరమా?