హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే ఎందరో ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారినపడ్డారు.
టెస్టు్ల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు.
I have been tested positive for covid and isolated myself on doctor’s advice. Who ever has been in contact from the past few days, please take necessary precautions…
— Revanth Reddy (@revanth_anumula) March 23, 2021
వైద్యుల సూచనల మేరకు తాను ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు.
కొద్ది రోజుల నుండి తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు