మహారాష్ట్రలో ఘోరం ప్రాణ వాయువే ప్రాణాలు తీసింది
ప్రాణ వాయువే ప్రాణాలు తీసింది. నాసిక్‌లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సీజన్ ట్యాంకర్ లీకయింది. ఈ క్రమంలో రోగులకు ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలోని 11 మంది రోగులు మరణించారు.
మహారాష్ట్రలోని కరోనా ఆస్పత్రుల్లో ఆక్సీజన్ కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆక్సీజన్ ట్యాంకర్లను పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాసిక్‌లోని జాకీర్ ఆస్పత్రికి కూడా ట్రక్కుల ద్వారా ఆక్సీజన్ తరలించారు.
వాటిని ఆస్పత్రిలోని ట్యాంకర్లో నింపుతుండగా ఒక్కసారిగా ఆక్సీజన్ లీకయింది. పెద్ద మొత్తంలో లీకవడంతో దట్టమై పొగలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలోని 171 మంది రోగులు ఆక్సీజన్‌పై చికిత్స పొందుతున్నారు. ఐతే ట్యాంకర్ లీక్ కావడంతో ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ప్రాణ వాయువు అందక 11 మంది మరణించారు.