పాత బస్టాండ్ తీసివేసి కొత్త సమస్యలు సృష్టించవద్దు….
ఖమ్మం: ఈరోజు నగరంలో పలు చోట్ల పాత బస్టాండ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసనలు…
ఈ సందర్భంగా CPM నాయకులు రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ
కొత్త బస్టాండ్ వున్న బైపాస్ రోడ్డుపై ఇప్పటికే వేలాది వివిధ రకాల వాహనాలతో, లారీలతో ట్రాఫిక్ పెరిగి ఏక్సిడెంట్లు జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పాత బస్టాండ్ తీసివేసి మెత్తం 1500 బస్సులు అన్నీ నూతన బస్టాండుకు బైపాస్ రోడ్డుకు వస్తే బైపాస్ రోడ్డుకు భారీ స్థాయిలో ట్రాఫిక్ పెరిగిపోతుంది
ఇలా చేసి నగర వాసులకు కొత్త సమస్యను సృష్టించవద్దు అని కోరారు.
నగర ప్రజలకు, చుట్టూ ఉన్న మండల ప్రజలకు, హాస్పిటల్స్ కు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు, విద్యార్థులకు, వ్యాపారులకు, రైల్వే స్టేషన్ కు, అన్నీ వర్గాలకు చాలా ఉపయోగపడుతున్న ఖమ్మం పాత బస్టాండ్ ను లోకల్ బస్టాండుగా వుంచాలని డిమాండ్ చేశారు.
కళ్యాణ మంటపం కట్టాలనే అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి… పాత బస్టాండ్ పక్కనే ఉన్న TTD పెళ్లి మండపం ఇప్పటికే ఖాళీగా వుంటుంది అనే విషయాన్ని మంత్రి గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వై శ్రీకాంత్, దీపక్ చౌదరి, వై విక్రమ్, వై శ్రీనివాసరావు, జబ్బార్, లింగయ్య, మీరా సాహిబ్, తిరుపతి రావు, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు