జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమ – తోట త్రిమూర్తులు
వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం..
మండపేట: జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
మండపేట మండలం ఏడిదలో మంగళవారం వైఎస్సార్ ఉచిత పంటల భీమా విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ
రైతులు, రైతు కూలీలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్న జగన్ ఆశయం మేరకు రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
రైతు సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద చెల్లింపులను నియోజకవర్గ రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ఖరీఫ్-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం పరిహారం విడుదల చేసిందన్నారు. సీఎం జగన్ రైతుల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 60 శాతానికిపైగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలను నిర్లక్ష్యం చేశాయన్నారు.
ఈ కార్యక్రమంలో మండపేట ఎంపిడిఓ ఐదం రాజు, గ్రామ సర్పంచ్ ఆశీర్వాదం, గ్రామకార్యదర్శి ఉండమట్ల వీర్రాజు, వైయస్ఆర్సిపి నాయకులు రామిశెట్టి శ్రీహరి, వల్లూరి రామకృష్ణ, వార్డు మెంబర్లు, సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.