ఎలక్ట్రానిక్ మీడియా లోగో కరోనా క్యారియర్…??
జర్నలిస్టులూ జాగ్రత్త…!
అవును ఇది ముమ్మాటిటికీ నిజం.. సరైన జాగ్రత్తలు పాటించకుంటే పాత్రికేయులు నిత్యం వాడుతున్న లోగోలు కరోనాను మోసుకొస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహామే లేదు.
ఇది యదార్థం కూడా కానీ కొందరు పాత్రికేయులు మాత్రం ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకొంటున్నారు. కానీ లోగో ఉపయోగించే తీరులో దానిని వినియోగించే జర్నలిస్ట్‌కు, మాట్లాడే వారికి ఇద్దరికీ ప్రమాదమే.
ఎందుకో చూద్దాం.
వివిధ చానళ్లు తమ లోగోలు గల మైకులను ప్రతి రిపోర్టర్‌కు ఇస్తారు. మేజర్ సెంటర్లలో ప్రతి రోజూ షుమారుగా 10 నుండి 15 వరకు ఆ మైకును ఉపయోగిస్తూ ఉంటారు.
నియోజకవర్గ పరిధిలో అయితే అది ఇంకా ఎక్కువగా వుండే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇక చెప్పే పనే లేదు, ఆ మైకు ఎన్ని చేతులు మారుతుందో ఎంత మంది ఆ మైకులో మాట్లాడతారో లెక్కే ఉండదు.
ప్రతీ న్యూస్ ఐటంకు కవరేజ్ పూర్తయాక రిపోర్టర్ వాయిస్‌లో కోసం లోగో మైకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఆ లోగోమైక్ బైట్ కోసం ఇతరుల ముందు పెట్టినప్పుడు వారు మాట్లాడేప్పుడు తుంపర్లు లోగోలోకి వెళ్లే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
అదే మైక్ ను మరొకరి దగ్గరో, లేక జర్నలిస్ట్ లైవ్ కోసం కానీ ఎండ్ వాయిస్ ఓవర్ కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు జర్నలిస్ట్ శరీరంలోకి మహమ్మారి కణాలు చేరి కరోనా సోకే అవకాశం ఎక్కువగా వుంది.
ఇటువంటి సందర్భంలో మైకును వాడే ప్రతీసారీ తప్పని సరిగా శానిటైజ్ చేయక తప్పదు. ఒకవేళ పదే పదే శానిటైజ్ చేయడం వల్ల మైకు పాడయినా, కరోనా సోకి మనిషి ప్రాణానికి ప్రమాదం సంభవించేకంటే లోగోమైక్ పాడవడం పెద్ద ఇబ్బందికర విషయం కాదు.
కెమికల్ శానిటైజేషన్ కంటే ఎలక్ట్రానిక్ వస్తువలను యువి శానిటైజేషన్ చేయడం ఉత్తమం.
ఇప్పటికైనా జర్నలిస్ట్ మిత్రులు జాగ్రత్తగా వవ్యహరించండి లేదా విలువైన జీవితాలు నష్టపోవాల్సి వస్తుంది.