బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం పెద్ద పులుగు వారి పాలెం నుండి భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వేగేశన నరేంద్ర వర్మ గారి నాయకత్వంలో ఈ రోజు వేగేశన ఫౌండేషన్ కార్యాలయం నందు తెలుగు దేశం పార్టీలో చేరడం జరిగింది…
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వేగేశన నరేంద్ర వర్మ గారు మాట్లాడుతూ
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి బూటకపు పాలన పట్ల పెద్ద ఎత్తున ప్రజలు విసుగు చెందారు.
నిజమైన అభివృద్ధి ఒక్క చంద్రబాబు వల్లనే సాధ్యం అవుతుంది అని ప్రజలు భావిస్తున్నారు.
వై యస్ ఆర్ సి పి ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురి చేసినా ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనం…
తుది శ్వాస ఉన్నంత వరకు విశ్వాసం, క్రమశిక్షణతో వేగేశన నరేంద్ర వర్మ గారి వెన్నంటి ఉండి బాపట్ల నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలుపొందిస్తామని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ సందర్భంగా ప్రమాణం చేశారు
ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు మాట్లాడుతూ నూతనముగా పార్టీలో చేరిన కార్యకర్తలు, నాయకులకు, నియోజకవర్గ ప్రజలకు ఏ ఇబ్బంది ఎదురైనా వెన్నంటి ఉండి ఆ సమస్య ను తీరుస్తాను అని సభా ముఖంగా తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జయ ప్రకాష్ నారాయణ గారు , పార్లమెంట్ మహిళ ప్రధాన కార్యదర్శి పల్లం సరోజినీ గారు బాపట్ల నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు తోట నారాయణ గారు నల్లమోతు వారి పాలెం సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం గారు, చింతాయపాలెం సర్పంచ్ పీటా శ్రీనివాసరావు రావు గారు నక్కల వారి పాలెం సర్పంచ్ నక్కల శేషాద్రి గారు కర్లపాలెం మండల అధ్యక్షుడు ఎపూరి భూపతి రావు గారు బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు గారు కర్లపాలెం మండల ప్రధాన కార్యదర్శి కోమాట్ల కృష్ణ చలపతి రెడ్డి గారు కర్లపాలెం మాజీ సర్పంచ బోదుకూరి విజయ గారు, గోపిరెడ్డి, వెంకట స్వామి గారు సాంబ శివ రెడ్డి గారు బెజ్జం వేంకటేశ్వర్లు గారు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు