రెమ్‌డెసివిర్ కేటాయింపును నిలిపివేయనున్న కేంద్రం
రెమ్‌డెసివిర్ ఉత్పత్తి పది రెట్లు పెరిగింది
దేశానికి తగినన్ని రెమ్‌డెసివిర్ నిల్వలు ఉన్నవి, డిమాండ్ కంటే సరఫరా అధికం అయింది
వ్యూహాత్మకంగా రెమ్‌డెసివిర్ యొక్క 50 లక్షల వయల్స్ నిల్వ ఉంచబడతాయి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో రెమ్‌డెసివిర్ ఉత్పత్తి రోజుకు 33,000 వయల్స్ నుండి 2021 ఏప్రిల్ 11 నాటికి రోజుకు 3,50,000 వయల్స్ ఉత్పత్తి సామర్ధ్యానికి, పది రెట్లు పెరిగిందని రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా తెలియజేశారు.
రెమ్‌డెసివిర్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం ఒక నెలలో 20 నుండి 60 ప్లాంట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు.
డిమాండ్ కంటే సరఫరా చాలా ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు దేశానికి తగినంత రెమ్‌డెసివిర్ అందుబాటులోకి వచ్చింది.
రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ కేంద్ర కేటాయింపును నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు శ్రీ మాండవియా తెలిపారు.
దేశంలో రెమ్‌డెసివిర్ లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ ఏజెన్సీ, సిడిఎస్కోలను ఆయన ఆదేశించారు.
అత్యవసర అవసరాల కోసం వ్యూహాత్మక స్టాక్‌గా నిర్వహించడానికి రెమ్‌డెసివిర్ యొక్క 50 లక్షల వయల్స్ ను సేకరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.