సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. హిందూ మహిళ తన ఆస్తిని పుట్టింటి సభ్యులకు ఇవ్వోచ్చు..
దేశ అత్యున్యత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేశంలోని ప్రతి మహిళ తన తండ్రి నుంచి వచ్చిన వారిని ఆమె ఆస్తికి వారసులుగా తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తన పుట్టింటి వారిని కుటుంబ సభ్యులుగా అంగీకరించవచ్చని.. వారిని బయటి వ్యక్తులుగా తీసుకోలేమని స్పష్టం చేసింది. హిందువుల వారసత్య చట్టం ప్రకారం సెక్షన్ 15.1 D పరిధిలోకి వస్తారని.. తండ్రి తరుపున కుటుంబసభ్యులు కూడా ఆస్తికి వారసత్వంగా తీసుకోవచ్చని తెలిపింది. 1956లో హిందూ వారసత్వ చట్టం సెక్షన్ ప్రకారం ప్రతి మహిళ తండ్రి కుటుంబ సభ్యులు వారసుల పరిధిలోకి వస్తారని తీర్పు వెల్లడించింది. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం సెక్షన్ 13.1 డీ ద్వారా తండ్రి వారసులను తన ఆస్తి వారసులుగా తీసుకోవచ్చని.. వారు ఆస్తిని పొందేందుకు వీలుందని స్పష్టం చేసింది.
కానీ స్త్రీ తండ్రి నుంచి వారసులుగా వచ్చినప్పుడు.. ఆస్తిని ఎవరు సంపాదించినా.. తండ్రి కుటుంబ సభ్యులు ఆ స్త్రీకి కూడా కుటుంబసభ్యులవుతారని స్పష్టం చేసింది.
జగ్నో అనే మహిళ తన భర్త ఆస్తిని పొందడంపై కేసు నమోదైన క్రమంలో కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఆమె భర్త 1953లో మరణించాడు. వారికి సంతానం లేకపోవడంతో.. ఆమెకు వ్యవసాయ ఆస్తిలో సగం వాటా వచ్చింది. సెక్షన్ 14 ప్రకారం, 1956 వారసత్వం చట్టం ప్రకారం ఆమె ఆ ఆస్తికి వారసురాలు అయ్యింది. దీని తర్వాత ఆమె ఆ ఆస్తి కోసం ఒక ఒప్పందం కుదుర్చుకొని తన సోదరుడి కొడుకులను ఆస్తిని ఇచ్చింది. దీంతో ఆమె భర్త సోదరుడి కొడుకులు ఆ ఆస్తి తమకు చెల్లుతుందని వారి ఆస్తి వారికి ఇవ్వాలని 1991లో సివిల్ కోర్టులో దావా వేశారు. తన భర్త ఆస్తిని ఆమె సోదరులకు ఇచ్చేందుకు ఆమోదించాలని జగ్నో తిరిగి హైకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో ఆమె భర్త సోదరుడి కుమారులు అందుకు ఒప్పుకోలేదు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హిందూ వితంతువు తన తండ్రి కుటుంబంతో తిరిగి ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని.. ఆమె భర్త ఆస్తిని ఆమె సోదరుడి కోడుకుల పేరు మీద చేయలేమని స్పష్టం చేసింది. ఆ ఆస్తి అనేది ఇప్పటికే ఆస్తిలో హక్కు ఉన్నవారితో మాత్రమే ఈ సమస్య పరిష్కరించుకోవాలని పేర్కోంది. దీంతో హైకోర్టు ఈ కేసును కోట్టివేసింది. అనంతరం జగ్నో సూప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హిందూ వారసత్య చట్టంలోని సెక్షన్ 15.1డీ ప్రకారం హిందూ మహిళా తన తండ్రి బందువులు, కుటుంబ సభ్యులు తనకు బయటివారు కాదని వారు కూడా ఆమె కుటుంబంలోని సభ్యులేనని తెలిపింది. చట్టంలో కుటుంబం అనే పదానికి సంకుచిత అర్థం ఇవ్వలేమని.. చట్టంలో హిందూ మహిళ కుటుంబం పట్ల కూడా వివరణ ఉందని తెలిపింది. ఇప్పటికే హక్కులను సృష్టించిన ఆస్తిపై ఏదైనా సిఫారసు డిక్రీ ఉంటే, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 17.2 కింద రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.