తెలంగాణలోని జనగాం జిల్లాలో బంగారు నిధి బయటపడటం సంచలనం సృష్టించింది. జిల్లాలోని పెంబర్తిలో ఈ నిధి లభించింది.
ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం పెంబర్తి గ్రామానికి చెందిన రైతు తన పొలంలో భూమి చదును చేస్తున్నాడు. ఆ సమయంలో లంకె బిందె బయటపడింది.
దానిలో బంగారం కనిపించే సరికి షాక్ తిన్న ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.