కరోనా వార్డుల్లో ప్రార్థనల పేరిట మత ప్రచారం..!?
కాకినాడ: కరోనా వచ్చి ఉంటామో పోతామో తెలియని స్థితిలో జనాలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
ఈ సమయంలో కొబ్బరినూనె రాసి ప్రార్థనలు చేస్తే కరోనా నయమవుతుందంటూ ఓ ముఠా కోవిడ్ వార్డులో ప్రచారానికి దిగింది.
తాజాగా కోవిడ్ వార్డులను సైతం వదలకుండా ఈ ముఠా చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్ కొవిడ్ వార్డుల్లో మత ప్రచారం జోరుగా సాగుతోంది. కొబ్బరినూనెను తలకు రాసి ఓ ముఠా ప్రార్థనలు చేస్తోంది.
ప్రార్థనతో వ్యాధి నయం అవుతుందని హితోక్తులు చెబుతోంది. ఆసుపత్రి సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా మత ప్రచారం సాగుతోంది.
జనరల్, సర్జికల్ వార్డుల్లోనూ కొబ్బరి నూనె రాస్తూ సదరు ముఠా ప్రార్థనలు నిర్వహిస్తోంది. రాత్రి వేళల్లోనూ యథేచ్ఛగా మత ప్రచారం నిర్వహిస్తూ కొందరు మహిళలు ప్రార్థనలు చేస్తున్నారు.
అయితే వార్డుల్లోకి రాకూడదని ఆస్పత్రి సిబ్బంది వారించినప్పటికీ… ‘నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు.. నా ఇష్టం.. నేను వస్తానంతే’ అని ఆ మహిళ హెచ్చరించడం గమనార్హం.
ఈ ఘటనపై ఆస్పత్రి సూపరిడెంట్ గానీ, అధికారులు ఇంతవరకూ స్పందించలేదు.