పశుసంవర్ధక శాఖ అదనపు భవన నిర్మాణ శంకుస్థాపన..
మండపేట: మండపేటను అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రం నందు అదనపు వసతి భవనమునకు ఆదివారం శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో మండపేట నియోజకవర్గంను అభివృద్ధి బాటలో నడిపిస్తామని అన్నారు.
కోటి యాభై ఐదు లక్షల రూపాయలతో పశుసంవర్ధక శిక్షణ కేంద్రము నందు అదనపు వసతి భవన నిర్మాణం చేపట్టామని అన్నారు.
అలాగే పురపాలక కార్యాలయం ఎదురుగా మున్సిపల్ స్థలములో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంకు తొందరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, 12వ వార్డు కౌన్సిలర్ మల్లసాని సీతామహాలక్ష్మి, జిన్నూరి సాయిబాబా,
మీగడ శ్రీనివాస్, ముమ్మిడివరపు బాపిరాజు, శిరంగు. శ్రీను, పోతంశెట్టి ప్రసాద్, టపా ఫుల్లే శ్వరరావు, శీతిన సూరిబాబు, ఈలి తాతాజీ, మురళి, జొన్నపల్లి సత్తిబాబు, పిల్లా వీరబాబు, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.