ఏలూరు మాజీ ఎంపి , మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ మృతి
గత కొన్ని రోజులుగా రాంజీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రాంజీ.
ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి బాబు గారి తనయుడు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు శ్రీ మాగంటి రాంజీ గారిని వారు చికిత్స పొందుతున్న ఆంధ్ర ఆసుపత్రి, విజయవాడలో సందర్శించి, అనంతరం శ్రీ మాగంటి బాబు గారిని వారి నివాసమునందు కలిసి మనోధైర్యాన్ని అందించిన తెలుగు యువత, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా॥ పొగాకు జైరామ్ చందర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిని హరికృష్ణ గారు మరియు తెలుగు యువత సభ్యులు!
మాగంటి రాంజీ (మాగంటి రామ చంద్రన్, MKSRC Chowdary)15 ఫిబ్రవరి 1984 న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో మాగంటి వెంకటేశ్వరరావు (మాగంటి బాబు), పద్మవల్లి దేవి దంపతులకు జన్మించారు.
ప్రఖ్యాత రాజకీయ నాయకుడు (మాజీ మంత్రి, ఎంపి, మాజీ ఎమ్మెల్యే) మాగంటి బాబు పెద్ద కుమారుడు మరియు ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత (తెలుగు చిత్రాల కోసం, బిగ్ బాస్, మనోహరం, పెళ్లైనా కొత్తలో, తాళి, ప్రాణం, అల్లుడు గారు వచ్చారు, ఇతర సినిమాలు).
దివంగత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మనవడు. రవీంద్ర నాథ్ చౌదరి ప్రముఖ రాజకీయవేత్త (మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ (దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ నుండి ఉత్తమ జిల్లా పరిషత్ చైర్మన్ అవార్డు అందుకున్నారు), ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత (తెలుగు కోసం) గ్యాంగ్‌లీడర్, ఖైదీ నెం 786, మగధీరుడు, మగ మహారాజు, మహా నగరంలో మాయగాడు, పట్నం వచ్చిన పతివ్రతలు, విజయ, బొట్టు కాటుక, బొమ్మరిల్లు (పాత), మరియు ఇతర చిత్రాలు) దివంగత మాగంటి రాజకీయ నాయకుడు (మంత్రి దేవి), మాజీ ఎమ్మెల్యే).
రాంజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బి.టెక్., ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ లో ఎంబీఏ పూర్తి చేశాడు. 2011 లో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ (పద్మిని ఆర్ట్స్) ను స్థాపించడం ద్వారా ఫిల్మ్ ప్రొడక్షన్ లో ప్రవేశించాడు. 15 కోట్ల బడ్జెట్ తో మొదటి చిత్రం ‘తూనీగా తునీగా’ ను నిర్మించారు.
రాంజీ అవయవాలను దానం చేయుటకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది.
ఆయన భౌతికకాయాన్ని రేపు ఉదయం ఏలూరు తమ నివాసానికి తరలించనున్నట్లు సమాచారం.
నిన్న లోకేష్ కలిశారు.
మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబ సభ్యులను కలిసి రాంజీ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్న లోకేష్ ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ మన ముందుకు వస్తారని ధైర్యం చెప్పారు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అయితే అనుకోకుండా ఈ రోజు రంజీ తుదిశ్వాస విడిచారు.