కరోనాను కూడా క్యాష్ చేసుకున్న ఘనుడు తోడేరు బుడ్డారెడ్డి.. – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వెంకటాచలం మండలం కురిచెర్లపాడు, పాలిచెర్లపాడు, చవటపాళెం, ఇస్కపాళెం, మల్లుగుంటసంఘంలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆగడాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
“రైతుల వద్ద చేసిన వసూళ్లతో నెల్లూరులో ఇంటి వెనుక బంగ్లా మీద బంగ్లా కడుతున్నాడు…
బుడ్డారెడ్డి రెండేళ్లలో చేసిన పనులేమైనా ఉన్నాయంటే….మేం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవడం…ఇసుక, మట్టి, గ్రావెల్ తో పాటు బూడిద కూడా వదలకుండా దోచుకోవడం…
డేగపూడి-బండేపల్లి కాలువ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కమీషన్లు ఇవ్వలేదని పనులు ఆపేయడానికి మనస్సు ఎలా వచ్చిందో..
మా హయాంలో సిమెంట్ రోడ్లు వేస్తే తిరుపతి పార్లమెంటు ఎలక్షన్ ఉందని ఇప్పుడు సవిటి కాలువలు కట్టిస్తున్నాడు..
పిడతాపోలూరు మట్టి, వల్లూరు చెరువు ఉప్పుచవుడు ఇసుకతో జరుగుతున్న ఆ పనులు ఆర్నెళ్లు కూడా మన్నే పరిస్థితి లేదు..
ఓట్ల కోసం ఊళ్లలో తిరుగుతూ సోమిరెడ్డిని తరిమికొట్టాలని తోడేరు బుడ్డారెడ్డి ఊగిపోతూ మాట్లాడుతున్నాడు..
మా హయాంలో వెయ్యి రూపాయలు ఉన్న ఇసుకను నువ్వు 6 వేలకు అమ్ముకుంటున్నందుకు తరమాలా…అడ్డగోలుగా మద్యం ధరలు పెంచి దోచుకుంటున్నందుకు తరిమికొట్టాలా..
బెల్టుషాపులు తెరిచి రాత్రి 8 దాటితే క్వార్టర్ పై రూ.50 అదనంగా నువ్వు దోచుకుంటున్నందుకు నన్ను తరిమికొట్టాలా…
ప్రభగిరిపట్నం కొండను నువ్వు లేపేసినందుకు నన్ను తరిమికొట్టాలా…గ్రావెల్ తిప్పలు నువ్వు మాయం చేసినందుకు నన్ను తరిమికొట్టాలా…
మేం చేపట్టిన పనులను నువ్వు అర్ధంతరంగా ఆపేసినందుకు నన్ను తరిమికొట్టాలా…రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వడానికి నువ్వు ఎకరాకు రూ.40 వేలు తీసుకుంటున్నందుకు నన్ను తరమాలా…
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవు…
ముత్తుకూరు మండలంలో వలంటీర్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఫొటోలు తీశారని టీడీపీ కార్యకర్తపై కేసు నమోదు చేశారు….
కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముత్తుకూరు వెళ్లి పోలీసుస్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ముట్టడించి నిలదీస్తీ నీళ్లు నమిలారు..
కొందరు ఎస్సైలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు….పరిధిదాటి వ్యవహరిస్తున్న పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు…అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలను వేధించిన వారిని కోర్టు మెట్లు ఎక్కించబోతున్నాం..
ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో, ఎవరి హయాంలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు జరుగుతున్నాయో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు గమనించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా…
మన ఆడపడుచు, మచ్చలేని నాయకురాలు, పనిచేసే లక్ష్మిగా పేరుగాంచిన పనబాక లక్ష్మిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి పార్లమెంటు పంపాలని కోరుతున్నా…” అంటూ ప్రజలనుద్దేసించి ప్రసంగించారు.