ఒక్క ఛాన్స్ పేరుతో ఓట్లేయించుకుని తిరిగి జనాన్ని కుమ్మేస్తారా..
వెంకటగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..
మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, సీనియర్ నేత పనబాక కృష్ణయ్య తదితరులతో కలిసి టీడీపీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేసిన సోమిరెడ్డి
రాజశేఖర్ రెడ్డి కొడుకు ఒక్క ఛాన్స్ అడిగాడని జనం ఓట్లు కుమ్మేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓట్లేసిన వారినే కుమ్మేస్తున్నారు..
టీడీపీ హయాంలో రూ.80గా ఉన్న పామాయిల్ ప్యాకెట్ ను ఓట్లేసిన జనం కోసం రూ.140కి పెంచారు..
పగలంతా కష్టం చేసిన సోదరుల్లో కొందరు సాయంత్రం తాగే బుడ్డీ రూ.90గా ఉంటే ఓట్లేశారని రూ.190 చేశారు..
గత ప్రభుత్వ హయాంలో కోరిన ఇసుక రూ.1200కి ఇంటికి పంపించే వారు..ఇప్పుడు రూ.6 వేలు పైన పెట్టినా నాణ్యమైన ఇసుక దొరకని దుస్థితి..
ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్నపని కావాలన్నా పీఏలు, ఎమ్మెల్యేల లెఫ్ట్, రైటుల దగ్గరకు పోవాల్సిన పరిస్థితి..
ఇక పోలీసులు, రెవెన్యూ వాళ్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..
గతంలో ఓట్లు వస్తే ఆ పని చేస్తాం..ఈ పని చేస్తాం వరాలిచ్చే వాళ్లం..
ఓటు వేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తాం..ఇళ్ల పట్టాలు వెనక్కి తీసుకుంటాం..అమ్మ ఒడి ఆపేస్తామనే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో చూస్తున్నాం..
చివరికి స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసే స్వాతంత్ర్యం ప్రతిపక్ష పార్టీలకు లేదంట..
పేదోళ్ల కోసం అధునాతన వసతులతో కట్టిన హౌసింగ్ ఫర్ అపార్టుమెంట్లను బీడు పెట్టేశారు..
పేదోళ్లు మంచి ఇళ్లలో ఉండటం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు..మంచి ఇసుక కొనుక్కోవడానికి లేదు..చివరకు పేదోళ్లు నాణ్యమైన బుడ్డీ కొనుక్కునే అవకాశం కూడా లేకుండా చేశారు..
అమ్మ ఒడి పేరుతో ఏడాదికి రూ.14,000 ఇచ్చి నాన్న బుడ్డీకేమో రూ.110 లెక్కన ఎక్కువ గుంజుకుంటూ నెలకే రూ.3వేలకు పైన లాగేసుకుంటున్నారు..
ఈ ఎన్నికలు ముగియగానే మళ్లీ ఇంటి పన్నులు, కుళాయి పన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు..ఖాళీ స్థలాలున్నా పన్ను వేస్తారంట..
ప్రజలు వీటన్నింటిని గమనించి టీడీపీ అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిపించాలని కోరుతున్నాం..