ఉగాది వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.
నెల్లూరు, వెంకటగిరి నియోజకవర్గం వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం.
వెంకటగిరి నియోజకవర్గం తెదేపా కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు.
ప్లవనామ సంవత్సరం సందర్భంగా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆ దైవాన్ని ప్రార్ధించడం జరిగిందని వారు తెలియజేసారు.