ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలి..
ఎవరు బయటకు రావద్దు..
ఎమ్మెల్యే జోగేశ్వరరావు
మండపేట:- ఎవరికి వారు తమ ఆరోగ్యరక్షణకు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. మండపేట నియోజకవర్గ పరిధిలో వందలాది మంది కరోనా బారిన పడి ఆసుపత్రిలో ఉన్నారన్నారు.
చాలా మందికి ఆసుపత్రిలో బెడ్లు దొరక్కుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇక హోమ్ ఐసోలేషషన్లో ఉన్నవారి పరిస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు.
కనీసం సరైన వైద్య సహాయం, సలహా కూడా వారికి అందడం లేదని పేర్కొన్నారు. గత ఏడాదికి ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరు పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. ప్రజల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోన్నారని విమర్శించారు.
కోవిడ్ వ్యాక్సిన్ మే 1 నుండి 18 నుండి 45 వారికి ఇస్తామని ప్రకటించారని ఎక్కడా ఇది అమలు కాలేదన్నారు. ఇక 45 ఏళ్ళు దాటిన వారికి రెండవ డోసుకే దిక్కు లేదన్నారు.
వందలాది మంది గడువు ముగిసిందని డోస్ ఎప్పుడు వేస్తారంటూ అడుగుతున్న సమాధానం చెప్పలేని స్థితిలో ప్రజాప్రతినిధులుగా తాము, వైద్యులు ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
టీకా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. ఇలాంటి సందర్భంలో ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు పాటించాలని వేగుళ్ళ విజ్ఞప్తి చేసారు.