కోవిడ్ 19 ప్రత్యేక చర్యలపై తూ.గో. జిల్లా కలెక్టర్ మురళిధర్ రెడ్డి సచనలు
తూర్పూగోదావరి జిల్లా, కాకినాడ: ప్రబలుతున్న కరోనా దృష్ట్యా రాబోయే నెల రోజుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టరు సూచించారు.
రంజాన్ మాసంలో మసీదులో ప్రార్థనలు చేసేవారు పరిమితి మించి ప్రజలు ఉండకూడదని తెలిపారు.
మే మాసంలో జరిగే గ్రామదేవతల జాతరలకు జిలాల్లో ఎక్కడ ప్రజలకు అనుమతి లేదని తెలిపారు.
పూజారులు వరకు మాత్రమే అనుమతి ఉందని, ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని తెలిపారు.
ఆలయాల్లో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్సననికి అనుమతి ఇస్తున్నట్లు తెలియజేశారు.
జిల్లాలో ఉన్న అన్ని చర్చిలలో ప్రజలకు అనుమతి లేదని, పాస్టర్లకి మాత్రమే అనుమతి ఉందని, ఆదివారం కూడా ప్రార్థనలు చెయ్యడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
రాత్రి 10 గంటలు నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందని అన్నారు.
వ్యాపార లావాదేవీలు షాపులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అశోషియన్ మాత్రమే ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు ఉంటాయని తలెపారు.
రెస్టారెంట్లు సాయంత్రం 6 గంటలు వరకు మాత్రమే అనుమతి ఉందని 6 దాటినా తరువాత డోర్ డెలివరీ ఇవ్వాలని తెలిపారు.
33 ఆసుపత్రుల్లో కరోన చికిత్స అందిస్తున్నట్లు తెలియజేశారు.