పౌరులతో దురుసుగా ప్రవర్తించవద్దు: డీజీపీ
నేటి రాత్రి నుండి తెలంగాణ రాషట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు కానున్న నేపధ్యంలో, నైట్ కర్ఫ్యూ అమలులో పౌరులతో దురుసుగా ప్రవర్తించరాదని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు.
కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణలో ఈ రోజు రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నందున పోలీసు జోనల్ ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నైట్ కర్ఫ్యూ పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. కర్ఫ్యూ నిబంధనలపై పౌరులను చైతన్యపర్చాలని తెలిపారు.
