మండపేట మునిసిపల్ ఎన్నకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకలు
పకడ్బందీగా ఏర్పాట్లు…
పోలింగ్ నిర్వహణ పై సూచనలు…
ఉపసంహరణ ప్రక్రియ పరిశీలన…
స్ట్రాంగ్ రూమ్ తనిఖీ…
ఎన్నికల లెక్కింపు పై సలహాలు…
ఎన్నికల పరిశీలకులు అంబేద్కర్ పర్యటన…
మండపేట:- మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మండపేట మునిసిపాలిటీ ని బుధవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా రెండో రోజు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఏర్పాట్లను ఆయనకు వివరించారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్ లు భద్ర పరిచే గదిను తనిఖీ చేశారు. మునిసిపల్ కార్యాలయం పైఅంతస్తులోని ఎమ్మెల్యే ఛాంబర్ ను స్ట్రాంగ్ రూమ్ గా మారుస్తున్నట్లు కమిషనర్ ఆయనకు తెలిపారు.
అక్కడ ఉన్న మొత్తం ఆరు కిటికీలు మొత్తం సీజ్ చేయాలని అంబేద్కర్ సూచించారు. అనంతరం ఎన్నికల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ హల్, ప్రత్యేక అధికారి చాంబర్ లను పరిశీలించారు.
కాగా చాంబర్ వద్ద పార్టీలు ఏజెంట్ లకు ఎక్కడ వరకు అనుమతి ఇవ్వాలో ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ ఐ బి రాజేష్ కుమార్ ,ఏ ఈ శ్రీనివాస్, టిపిఎస్ కట్టా వీర బ్రహ్మం,మునిసిపల్ మేనేజర్ నిర్మాలకుమారి, ఆర్ ఐ వంక ప్రభాకర్ చౌదరి, సానిటరీ తనిఖీ అధికారి ముత్యాల సత్తిరాజు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.