వరంగల్ మునిసిపాలిటి పరిధిలో ఎన్నికల ఢంకా మోగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త శోభారాణి 58వ డివిజన్ నుండి టికెట్టు ఆశించింది.
జనరల్ మహిళగా అవకాశం రావడం… గతంలో టిఆర్ఎస్ పార్టీ అర్బన్ అద్యక్షురాలిగా చేయడం… ఆమెకు అనుకూలం అంశాలు.
అంతేగాక, కేసీఆర్ కేటీఆర్ లు గతంలో తనను ఆదరించి హమీలు ఇవ్వడం వల్ల చాలా ఆశలు పెట్టకున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది శోభారాణి.
ఉద్యమంలో చాలా చురుకుగా మొదటి నుండి పాల్గొన్న మహిళ తాను అని, ఇప్పటికీ కేసుల చుట్టు సొంతడబ్బుతో తిరుగుతున్నా అంటుంది శోభా రాణి ఆవేదన వ్యక్తం చేసింది.
కుటుంబాన్న ఆగం చేసుకున్న తనకు టికెట్ ఇవ్వడం లేదని… 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం అన్యాయమంటూ అధాలత్ సెంటర్లో టవర్ ఎక్కి నిరసన తెలుపుతుంది.
తనకు టికెట్ కేటాయించకుంటే పెట్రోల్ పోసుకోని పైననే కాల్చుకోని చనిపోతానంటూ బెదిరింపులగు దిగింది శోభారాణి.