సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు కె సుబ్బరాజు మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
కె సుబ్బరాజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యునిగా, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా పని చేశారు.
సిపిఐ విజయవాడ నగర కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పార్టీ ఉన్నతికి కృషి చేశారు.
విద్యార్థి, యువజన నేతగా, శాంతి స్నేహ సంఘీభావ సంఘం, ఇస్కఫ్ జాతీయ నాయకునిగా, విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శిగా, కోశాధికారిగా ఆయన తన సేవలందించారు.
సుబ్బరాజు అంత్యక్రియలు రేపు విజయవాడలో జరగనున్నాయి.
కామ్రేడ్ కె సుబ్బరాజు మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని, సుబ్బరాజు కుటుంబ సభ్యులకు సిపిఐ ఏపీ రాష్ట్ర సమితి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రామకృష్ణ తెలియజేసారు.